ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య చెల్లి తో ...

national |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 05:35 PM

సోదరిని కాపాడుకునేందుకు కట్టుకున్న భర్తను జైలు పాలు చేసిన ఘటన బీహార్ లోని భాగల్ పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ భగల్ పూర్ సమీపంలోని గ్రామం నుంచి వచ్చి తన అక్క బావతో కలిసి నివాసముంటోంది. కాగా గత కొంత కాలంగా నిందితుడి భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన సోదరి సేవలు చేయడానికి వారింటికి వచ్చింది. అయితే ఇదే అదనుగా తీసకున్న నిందితుడు బాధిత మహిళపై కన్నేశాడు. నిందితుడి భార్య ఇది గమనించి వారించినప్పటికీ వినలేదు. బాధిత మహిళను తన కోరిక తీర్చమని వెంటపడ్డాడు. ఎలాగో తన భార్య ఆరోగ్యం బాగా లేదు కాబట్టి ఆమె సోదరిని ఇచ్చి తనకు వివాహం చేయాలని, ఇద్దరినీ బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. అయినప్పటికీ బాధిత మహిళ సోదరి నిందితుడి మాటలు నమ్మలేదు. అంతే కాదు తన సోదరికి దూరంగా ఉండాలని పలు మార్లు హెచ్చరించింది. అయినా ఆమె మాటలు పెడచెవిన పెట్టాడు. ఎలాగైన మరదలిని ముగ్గులోకి దింపి తన పశువాంఛ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.


కాగా ఒక రోజు బాధిత మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నిందితుడు ఇంట్లోనే బంధించి ఆమెపై లైంగిక దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె ఎంతలా ప్రాధేయపడినా, వినకుండా ఆమెను బలవంతం చేశాడు. ఇంతలో బాధిత మహిళ సోదరి ఇంటికి వచ్చింది. తలుపు ఎంత బాదినప్పటికీ తెరవకపోవడంతో మహిళ స్థానికుల సహాయంతో తలుపు బద్దలు కొట్టింది. తన సోదరిపై కట్టుకున్న భర్తే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేసింది. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడుని అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com