మనకి ఏదైనా అత్యవసర సరకు మార్కట్లో దొరకట్లేదంటే ఆన్లైన్లో స్టార్టప్కులు చూసి సరఫరా చేసేలా ఆర్డర్లు పెట్టేస్తాం. అయితే మందుబాబులకు ఏకంగా ఇంటి వద్దకే మద్యం అందించేందుకు ఈ మధ్య ప్రారంభించిన హిప్ బార్ (HipBar) యాప్ విషయంపై కన్నడ హైకోర్టు సీరియస్ అయ్యంది. హిప్ బార్ ఇండియాలో ఆల్కహాల్ ను డోర్ డెలివరీ చేసేందుకు ప్రారంభమయిన తొలి యాప్. అయితే, కర్నాటక హైకోర్టు ఈ ఆన్ లైన్ ఆల్కహాల్ బుకింగ్ చెల్లదని తీర్పు చెప్పడంతో ఈ యాప్ పర్మనెంటుగా మూతపడింది. దేశంలో చాలా వస్తువులు ఇపుడు డోర్ డెలివరీ అందుతున్నాయని, ఆ క్రమంలోనే మద్యం డోర్‌డెలివరీ ఆరంభించామంటూ నిర్వాహకులు చేసిన వాదనని కొట్టపడేస్తూ ఆల్కహాల్ డోర్ డెలివరీ కి లైసెన్స్ ఇచ్చేందుకు కర్నాటక ఎక్సయిజ్ యాక్ట్,1965లో అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది.