శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన 8 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2.59లక్షలు, ఔట్‌ఫ్లో 2.96లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంలో ప్రస్తుత నీటి నిల్వ 213.88 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.