తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కొమ్మకు ఓ పాము తన తోకను చుట్టుకుని వేలాడుతోంది. ఇది గమనించిన వీరవనలూర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్యాంసన్, ఆ పామును దాని తోక ద్వారా నేర్పుగా పట్టుకున్నాడు. అది మెల్లగా అతని మెడ మీదుగా తలపైకి చేరింది. పాముతో సహా కొంత దూరం అలాగే నడుచుకుంటూ వెళ్లి.. దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాములు అంటే తనకు భయం లేదని, వాటిని పట్టుకోవడం తనకు చిన్నతనం నుంచే అలవాటని చెప్పాడు.