ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యభిచారం చేయాలని పెంపుడు తండ్రి దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2019, 10:30 AM

వ్యభిచారం చేయాలని దాడికి పాల్పడిన పెంపుడు తండ్రిని చిలకలూరిపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు ఓ మహిళ తన పెంపుడు తండ్రి ప్రభుదాసు అలియాస్‌ వీరారావు వద్ద ఆశ్రయం పొందుతుంది. సదరు తండ్రి ఆమెను వ్యభిచారం కూపంలోకి దింపాడు. 13 సంవత్సరాల నుంచి వ్యభిచారం చేయిస్తున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం వీరారావు తీసుకొని జల్సా చేస్తున్నాడు. ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో విషయం భర్తకు తెలిసి వదిలి వెళ్లిపోయాడు. దీంతో సదరు మహిళ వ్యభిచారం చేయనని చెప్పి వీరారావుకు తెలియకుండా ఇద్దరు పిల్లలతో చిలకలూరిపేటకు వచ్చి జీవిస్తోంది. ఇది తెలుసుకున్న వీరారావు చిలకలూరిపేటకు వచ్చి మరలా వ్యభిచారం చేయాలని సదరు మహిళతో గొడవకు దిగాడు. ఈక్రమంలో సుత్తితో కొట్టడంతో ఈనెల 22న పట్టణ పోలీసుస్టేషన్‌లో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సోమవారం చిలకలూరిపేట బస్టాండ్‌ వద్ద వీరారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com