ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిట్‌నెస్ ట్రైనర్ భాగోతం...బరువు తగ్గిస్తానని చెప్పి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 12:31 PM

అమ్మాయిలకు ఎక్కడికెళ్ళిన వేధింపులు మాత్రం తప్పలేదు. తాజాగా ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ భాగోతం బట్టబయలయింది. బరువు తగ్గించేందుకు సూచనలు ఇస్తానంటూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఓ యువతిని లైంగికంగా వేధించాడు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని టార్డియో పోలీసుల వివరాల ప్రకారం..మహాలక్ష్మీ రీకోర్స్ ఫిట్‌నెస్ సెంటర్‌లో 29 ఏళ్ల ఫ్రీలాన్స్ పర్దేషీ అనే వ్యక్తి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చే కస్టమర్ల నుంచీ కొద్ది మొత్తం డబ్బు తీసుకొని... ఫిట్‌నెస్‌పై సలహాలూ, సూచనలూ ఇస్తుండేవాడు. తాజాగా ఉదయం ఆరున్నరకు 16 ఏళ్ల యువతి బరువు తగ్గేందుకు అక్కడకు వచ్చింది. ఇటీవలే ఆమె అందులో చేరింది. జాగింగ్ ట్రాక్‌పై జాగింగ్ చేయసాగింది. ఆమె దగ్గరకు వచ్చిన పర్దేషీ... కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తే... టెక్నిక్స్ పాటిస్తే... ఈజీగా బరువు తగ్గవచ్చంటూ... ఇలా చెయ్యాలంటూ... ఆమెను పట్టుకున్నాడు. ఆమె మర్మాంగాలపై చేతులు వేస్తూ... ఇష్టారాజ్యంగా ప్రవర్తించసాగాడు.


వెంటనే అలర్టైన ఆ యువతి... అతన్ని బలంగా వెనక్కు నెట్టింది. తనకు ఏ టెక్నిక్‌లూ అవసరం లేదంది. అంతే... ఆమె వైపు కోపంగా చూడసాగాడు. భయంభయంగా అక్కడి నుంచీ వెళ్లిపోయిన బాధితురాలు... ఇంటికి వెళ్లి పేరెంట్స్‌కి విషయం చెప్పింది. వాళ్లు యువతితో కలిసి సాయంత్రం పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా... పోస్కో చట్టం కింద కేసు రాసిన పోలీసులు... అతని కోసం ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లారు. ఆ ఫిట్‌నెస్ సెంటర్‌లో చాలా మంది ట్రైనర్లు ఉన్నారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన పర్దేషీ... సిల్వర్ బ్రాస్‌లెట్ వేసుకున్నాడు. దాని ఆధారంగా అతన్ని గుర్తుపట్టిన పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com