సిరియాలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 13 మంది మరణించారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. సిరియాలోని ఇడ్లిబ్ ప్రొవిన్స్ దక్షిణ భాగంలో ఉన్న హాస్ పట్టణంపై రష్యాకు చెందిన విమానం ఈ దాడులకు పాల్పడిందని బ్రిటన్లోని సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది.