హైదరాబాద్: బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కుమారుడు ఆకాశ్ ముఖర్జీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అతివేగంగా కారును నడిపిన అతను.. కోల్కతాలోని ఓ క్లబ్ గోడను ఢీకొట్టాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎంపీ రూపా కుమారుడు ముఖర్జీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్తో పాటు ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఆకాశ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడా అన్న కోణంలో విచారణ సాగుతున్నది. కోల్కతాలోని అలిపోర్ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టనున్నారు. చట్టం ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై అభిప్రాయం వ్యక్తం చేశారు.