విజయవాడ, సూర్య బ్యూరో : కొత్త మంు్తల్ర ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం వెలగపూడి సెక్రటేరియట్ వద్ద అంతా సందడిగా నెలకొంది. కొత్త మంు్తల్రగా ప్రమాణ స్వీకారం చేయటానికి వచ్చిన నేతలతో పాటు వారి బంధువులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావటంతో ఈ ప్రాంతమంతా ఉదయం ఏడు గంటల నుంచే రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిది గంటలకే సినిమా హీరో బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరా దేవిలు వచ్చారు. వారి వెంట నారా లోకేష్, నారా బ్రాహ్మణితో పాటు వారి కుమార్డు దేవాన్ష్‌లు వచ్చారు. దేవాన్ష్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్ష్‌ణగా నిలిచాడు. నారా లోకేష్ ప్రమాణ స్వీకార ప్రదేశానికి రావటంతో మరింత సంతోషకరంగా ప్రమాణ స్వీకార ప్రాంతం మారింది. నారా లోకేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేని ఆత్మీయులను, అభిమానులను ఆత్మీయంగా పలకిరించి పేరుపేరున అందరినీ కలిసారు. అమరావతి రాజధాని వెలగపూడి సెక్రటేరియట్ వద్ద ఆదివారం నిరాడంభంరంగా కొత్త మంు్తల్రు ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ర్ట ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్ కొత్త మంు్తల్రను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వారిచేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉదయం సరిగ్గా 9 గంటల 22 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రివర్గంలోకి 11 మంది మంు్తల్రను చేర్చుకున్నారు. కొత్తగా చేరిన వారితో కలిపి మొత్తం మంత్రి వర్గం 26 కి చేరింది. కొత్తగా మంు్తల్రుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కళా వెంకట్రావు, నారా లోకేష్, పితాని సత్యన్నారాయణ, నక్కా ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రావు వెంకట సుజయ రంగారావు, కాలువ శ్రీనివాసులు, ఆది నారాయణ రెడ్డి, కేఎస్ జవహర్, ఎన్. అమరనాధ్ రెడ్డి, భూమా అఖిల ప్రియలు ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంు్తల్రు గవర్నరుతో, ముఖ్యమంత్రితో కలిసి పొటో సెషన్ నిర్వహించారు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేష్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పాటు, గవర్నర్ ఆశీస్సులు పొందారు. కొత్త మంత్రికి ఆశీస్సులు అందచేసిన గవర్నర్ అనంతరం నారా లోకేష్‌తో రెండు నిమిషాలు పాటు ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంు్తల్రు అందరూ కలిసి అల్పాహారం స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినిమా హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు, ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మంు్తల్రు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ర్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొత్తగా మంు్తల్రుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి కుటుంభ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
![]() |
![]() |