విజయవాడ, సూర్య బ్యూరో : పేదల ఆశాజ్యోతిగా ప్రధాని నరేంద్రమోదీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి ముత్తవరపు వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో గెలవడంతో విజయోత్సవ సభను పార్టీ రాష్ర్టశాఖ నగరంలో ఆదివారం నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించినందుకు పార్టీ కార్యకర్తలకు అభినందులు చెప్పారు. ఈ అయిదు రాష్ట్రాల్లో 690 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 406 స్థానాలు సాధించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్గ రాష్ట్రాల్లో అత్యధిక అభ్యర్థులు గెలవగా, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సాధించడం జరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణ దేశ రాజకీయాల్లో కొత్త మలుపుగా అభివర్ణించారు. ప్రస్తుతం భాపాకు పార్లమెంటులో 352 మంది ఎంపీలున్నారని, 1,385 మంది ఎమ్మెల్యేలున్నారని ఇవి భాజపా చర్త్రిలో రికార్డుగా చెప్పారు. నేడు 17 రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలున్నాయన్నారు. అన్నివర్గాల వారు ఆదరించిన పార్టీగా భాజపా నిలిచిందన్నారు. మూడేళ్లుగా అవినీతి మరక అంటని పార్టీగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రపంచంలోనే పేరున్న మొదటి అయిదుగురు నాయకుల్లో మోదీ ఒకరన్నారు. యువత మోదీని ఆశాజ్యోతిగా భావిస్తున్నారన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే పట్టణాభివృద్ధి శాఖ ద్వారా దేశంలో నిర్మించనున్న 6 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో 1,93,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించానన్నారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ తాను ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై రాష్ర్ట మంు్తల్రు కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పి.వి.ఎన్.మాధవ్, కె.సత్యనారాయణరాజు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, మాజీ మంు్తల్రు కన్నా లక్ష్మీనారాయణ, ఎర్నేని సీతాదేవి, యువమోర్చా అధ్యక్షులు విష్ణూవర్ధన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఎస్.సి.మోర్చా అధ్యక్షులు దారా సాంబయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి, రాష్ర్ట నాయకులు ఆర్. లక్ష్మీపతి, యు.శ్రీనివాసరాజు, వెలగపూడి గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |