మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాఘ్‌పట్‌లోని బినౌలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వ్యక్తుల బారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..సదరు మహిళకి ఫేస్బుక్లో విపిన్ అనే వ్యకి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విపిన్ తన స్నేహితురాలిని అన్‌ఫ్రెండ్ చేశాడు. విపిన్ గుర్గావ్లోని పసిఫిక్ మాల్ లో ఉన్న ఆ మహిళ దగ్గరకు వచ్చి..ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత విపిన్ తన స్నేహితులతో కలిసి ఆ మహిళను లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విపిన్, ఆశిష్ బియాల్యాన్ లను అరెస్ట్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలి కుటుంబాన్ని విపిన్ అతని స్నేహితులు బెదిరించినట్లు బాఘ్పట్ ఏఎస్పీ రన్విజయ్ సింగ్ తెలిపారు.