పుణె: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ దశ తిరగాలని భావిస్తున్న పుణె టీమ్.. పదో సీజన్ ముందు కీలక మార్పులు చేస్తున్నది. ఇప్పటికే ధోనీకి గుడ్‌బై చెప్పి స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన ఆ టీమ్.. తాజాగా టీమ్ పేరులోనూ చిన్న మార్పు చేసింది. గత సీజన్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌గా ఉన్న పేరును ఈసారి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌గా మార్చింది. ఈ ఒక్క అక్షరాన్ని తొలగించడమే తకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆ టీమ్ భావిస్తున్నది. అయితే పేరు మార్పు వెనుక ఎలాంటి మూఢనమ్మకాలు లేవని టీమ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత సీజన్లో నలుగురు, ఐదుగురు ప్లేయర్స్‌ను సూపర్‌జెయింట్స్‌గా భావించాం. కానీ ఈసారి మాత్రం కొంతమంది ప్లేయర్స్‌నే అలా చూడటం లేదు. మొత్తం టీమ్‌ను సూపర్‌జెయింట్‌గా భావిస్తున్నాం అని ఆయన స్పష్టంచేశారు. గత సీజన్లో పుణె 14 మ్యాచుల్లో కేవలం ఐదింట్లో మాత్రమే గెలిచి ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో పుణె ఐపీఎల్ ట్రోఫీ వేట మొదలుపెట్టనుంది.