గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. టికెట్ల గురించి మాట్లాడేందుకు ఆయన వెళ్లినట్లు తెలిసింది. రాయపాటి కుటుంబం నరసరావుపేట ఎంపీతో పాటు సత్తెనపల్లి సీటు కూడా అడుగుతోంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావు, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కుమారుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్నాళ్లుగా రాయపాటి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనల్గా చంద్రబాబు నిర్ణయం ఏంటో తెలుసుకునేందుకు రాయపాటి సీఎం నివాసానికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |