ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరవుపై చర్చకు వైసీపీ పట్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2017, 01:20 AM

అమరావతి-సూర్య ప్రధాన ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల్లో మంగళవారం గందరగోళం నెలకొంది. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టగానే వాయిదా తీర్మానంపై చర్చకు వైకాపా సభ్యులు పట్టుబడడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో కరువుపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీనికి స్పీకర్‌ కోడెల ఒప్పుకోకపోవడంతో వారు పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కరువుపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టు బట్టారు. దీనికి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ కోడెల శివప్రరసాదరావు చెప్పినా వినకుండా నినాదాలు చేశారు. దీనిపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ శాస నసభా వ్యవహారాల సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నా రని, దాని ప్రకారం వాయిదా తీర్మానమైనా, వేరే ఏ అంశ మైనా ప్రశ్నోత్తరాల సమయం తర్వాతనే చర్చించాల న్నారు. ఆ నిర్ణయం తీసుకునే సమయంలో వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డిని నిర్ణయం ఆమోదయోగ్యమేనా, లేకంటే మీ నాయకుడిని అడిగి వస్తారా అని స్పీకర్‌ అడిగారన్నారు. దానికి శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైందని, దాని తర్వాతే ఏ చర్చ అయినా జరగాలని, తమ నాయకుడి అభిప్రాయం కూడా అదేనని చెప్పార న్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ ఇలా ప్రశ్నోత్త రాల సమయాన్నివృథాచేయడం సరికాదని కాల్వ అన్నారు.


శాసనసభలో వైకాపా నేతల ఆందోళన: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మహిళ లకు రక్షణ లేదంటూ వెకాపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియా న్ని చుట్టిముట్టి ఆందోళన చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు నినాదాలు చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పందిస్తూ మహిళ లపై గౌరవం లేని వైకాపాకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.


వైకాపా ఎమ్మెల్యేల ఆందోళనతో సభ వాయిదా: రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైకాపా శాసనసభలో పట్టుబట్టింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే కరవు అంశంపై చర్చించాలని వైకాపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక చర్చిద్దామని స్పీకర్‌ చెప్పినప్ప టికీ వారు వినిపించుకోకుండా సభలో నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేల తీరుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివా సులు, మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు సభా నిబంధనలు అతిక్రమి స్తున్నారని, వారిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని యనమల చెప్పారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.


అసెంబ్లీలో కొనసాగిన వాయిదాల పర్వం: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మంగళవారం వాయిదాల పర్వం కొనసా గింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత కరవుపై చర్చించాలని వైకాపా పట్టుబట్టి సభలో ఆందోళన చేసింది. దీంతో స్పీకర్‌ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశా రు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందంటూ వైకాపా సభ్యులు మళ్లీ సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టవద్దని స్పీకర్‌ వారించినా వారు వినకపోవడంతో సభ మళ్లీ వాయిదా పడింది.


టీడీపీ- వైకాపా మహిళా ఎమ్మెల్యేల వాగ్వాదం 


అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత, వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మె ల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ సీఎం తల నరుకుతా నంటూ గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించినట్లు పోలీసుల విచార ణలో వెల్లడైందని తెలిపారు. అదే సమయంలో అక్కడున్న గిడ్డి ఈశ్వరి అనితతో వాగ్వాదానికి దిగారు. సీఎం తల నరుకుతానని తాను అన్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. మీడియా  సమక్షంలో ఒకరిపై ఒకరు సవాల్‌ చేసుకోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత:


 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా తో మాట్లాడేందుకు వైకాపా, తెలుగుదేశం పార్టీ సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడు తున్న సమయంలో టీడీపీ సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుం డా మాట్లాడు తూనే ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి పీతల సుజాత మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరినా ఆమె పట్టించు కోలేదు. టీడీపీ సభ్యులు మైకులు తమ వైపు నకు లాక్కు నేందుకు ప్రయత్నించడంతో వైకాపా సభ్యులు అభ్యం తరం తెలిపారు. దీంతో మార్షల్స్‌ అక్కడకు చేరు కుని వారిని వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుం డా పోయింది. తమను సభతో పాటు బయటా మాట్లాడ కుండా అడ్డుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కండ బలంతో తమపై దాడులకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com