సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు వివరించారు. గుంటూరు జిల్లాకు రావాల్సిన నిధులపై చర్చించామని చెప్పారు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు తెలిపారు.
ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని తెలిపారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.