ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్లు: టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి: డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 07:58 PM

గుంతకల్లు పట్టణ పరిధిలోని టపాసుల విక్రయ దుకాణాలు, నిల్వ చేసే గోడౌన్స్ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులను కలిగివుండాలని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
దీపావళి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరిగా టపాసులు విక్రయ దుకాణాల నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com