లక్నో: ప్రియాంకా గాంధీ లక్నో చేరుకున్నారు. జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాక ప్రియాంక తొలిసారి లక్నోకు వచ్చారు. ప్రియాంకా గాంధీ వెంట ఆమె సోదరుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా వచ్చారు. లక్నోలో ఈరోజు ప్రియాంక 15 కిలోమీటర్ల మెగా రోడ్ షో నిర్వహించనున్నారు.