తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజు సందర్భంగా టీటీడీ అధికారులు శనివారం ఉదయం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకూ పల్లకీ సేవ ఉత్సవం వైభవోపేతంగా జరిపారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. వేడుకలో చివరి రోజు పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు.