ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 02:30 PM

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డీప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. పలు శాఖల అధికారులతో పాటు పలువురు మంత్రి, పవన్ సోదరుడు నాగబాబు అభినందనలు తెలిపారు. కాగా పవన్ కల్యాణ్ నేడు పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com