చంద్రబాబు బరితెగింపు మాటలే.. ఆయనను రాజకీయ సమాధి చేస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబూ.. నువ్వు రాజకీయాల్లో అహంకార స్వభావంతో ఉండి బరితెగించి మాట్లాడి ఈరోజు పల్లెల్లోకొచ్చి ఓట్లు ఎలా అడుగుతావు..? ఏ మొఖం పెట్టుకుని బీసీ, ఎస్సీ కాలనీలకు వెళ్తావు..? ఏ మొఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో డ్రైవింగ్ వృత్తి చేసుకునే డ్రైవర్లను ఓట్లు అడగగలవు..? బీసీలను దళితులను అనరాని మాటలు అని .. వారిని సందర్భానుసారం చులకనతో ఏహ్యభావంతో చూసిన చంద్రబాబుకు ఓటడిగే అర్హత లేదు. వారి ఓట్లపై ఆయనకెలాంటి హక్కులేదన్నారు.