గండికోట జలాశయంలో శుక్రవారం ఉదయం నాటికి 4. 63 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయంలో 204. 05 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ఏమి లేదు. గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్ కు 500 క్యూసెక్కుల నీరు వదిలినట్లు శుక్రవారం జల వనరుల శాఖ డిఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.