ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ ముంగిట మరో దిగ్గజం రికార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 04:41 PM

ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరే అవకాశముంది. వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ శతకాల ఘనతను అతడు సమం చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ లెజెండ్‌ రిచర్డ్స్‌ కెరీర్‌లో 24 శతకాలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 23 శతకాలతో ఉన్నాడు. ఓవల్‌లో అతడు మరో శతకం సాధిస్తే రిచర్డ్స్‌ సరసన నిలుస్తాడు. 70 టెస్టులు ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 54.44 సగటుతో 6098 పరుగులు చేయగా, రిచర్డ్స్‌ 121 టెస్టుల్లో 50.23 సగటుతో 8,540 పరుగులు చేశాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న విరాట్‌ శతకం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.


తన 23 శతకాలతో విరాట్‌ కోహ్లీ అత్యధిక శతకాలు చేసిన వారి జాబితాలో 25వ స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 51 అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై 15,00 పైచిలుకు పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా అతడు రికార్డు సాధించాడు. సచిన్‌ 2,535తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో కోహ్లీ 35 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 49 శతకాలతో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com