న్యూయార్క్ : ఆరవ సీడ్ నోవాక్ జోకోవిచ్.. యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. విపరీతమైన వేడి వాతావరణంలో సాగిన మ్యాచ్‌లో జోకోవిచ్ 6-3, 6-4, 6-4 స్కోర్‌తో మిల్మాన్పై విజయం సాధించాడు. 14వ సారి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకుంటున్న జోకోవిచ్.. మూడవ సారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది గాయం కారణంగా యూఎస్ ఓపెన్‌కు జోకోవిచ్ దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 11 సార్లు సెమీస్‌కు చేరాడతను. నాలుగవ రౌండ్లో ఫెదరర్‌కు షాకిచ్చిన జాన్ మిల్‌మాన్‌ను జోకోవిచ్ ఈజీగా ఓడించాడు. సెమీస్‌లో అతను నిషికోరీతో తలపడనున్నాడు.