సిరియా: రష్యన్ యుద్ధవిమానం లటాకియాలోని సిరియా తీరంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. రెండు సీట్లతో కూడిన సుఖోయ్-30 యుద్ధ విమానం క్మీమిమ్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత మధ్యదరా సముద్రంలో కూలిపోయింది. విమానం కూలగా జాబ్‌లా పోర్టు సిటీ వద్ద నీటిలో నుంచి పొగలు వస్తున్న ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.