అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేవాడినని అన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు జరిపి వెంటనే పరిష్కరించేవాడినని తెలిపారు. అమెరికా, జర్మనీలు ఉక్రెయిన్ కు ఆయుధాలను సమకూరుస్తున్నాయని, ఈ పరిణామాల కారణంగా రష్యా అణ్వాయుధాలతో దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.