బాల్ టాంపరింగ్ కేసులో చిక్కుకున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారత క్రికెటర్ యువరాజుసింగ్ అండగా నిలిచాడు. ' మనమందరం పొరపాట్లు చేస్తాం..స్మిత్ కూడా తప్పు చేశాడని మనకు తెలుసు.వాటి పర్యవసానాలు అతడు అనుభవిస్తాడు. ఈ ఒక్క సంఘటన వల్ల అతడి గౌరవాన్ని తగ్గించడం సరికాదు' అని యువీ పేర్కొన్నాడు. అటు టాంపరింగ్ చేసిన వారిలో స్మిత్ మొదటివాడు కాదని గుర్తించాలన్నారు.