న్యూఢిల్లి : సిఆర్పిఎఫ్ కమాండర్ చేతన్ తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం చేతన్‌కు సిజిఒ కాంప్లెక్స్‌లోని సిఆర్పిఎఫ్ డైరెక్టరేట్‌లో ఆఫీస్ వర్క్‌ను అప్పగించారు. జమ్ము కాశ్మీర్‌లోని బందిపొరాలో ఉగ్రవాదులతో ఏడాది క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో చేతన్ శరీరంలోకి 9 బుల్లెట్లు దూసుకుపోయాయి. రెండు చేతులకు ఫ్రాక్చర్లు అయ్యాయి. తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో కుడి కన్నును కోల్పోయారు. చేతన్ మరింతగా శక్తి పుంజుకోవాల్సి ఉండటంతో ఆయనకు ఆఫీసు పని అప్పగించారు.