ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి....అమెరికా మీడియాలో ఆయన ప్రస్తావన

national |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 12:09 AM

మన టాలివుడ్ కు అంతర్జాతీయ స్థాయిలోో పేరు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి రెండు భాగాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు ఎంపిక కావడం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శం. గోవాలో జరుగుతున్న ఇఫీ చలనచిత్రోత్సవంలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్నారు. 


ఇదిలావుంటే ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమం కోసం రాజమౌళి ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై కథనం రావడం విశేషం. ప్రఖ్యాత లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక 'ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు' అంటూ రాజమౌళిపై కథనం ప్రచురించింది. ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం చూస్తూ ఊగిపోతోందని తన కథనంలో పేర్కొంది. రాజమౌళిపై లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో కథనం రావడం పట్ల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com