ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనివాస్ హ‌త్యపై స్పందించిన వైట్‌హౌజ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 02:23 PM

వాషింగ్ట‌న్‌: అమెరికాలో తెలుగు యువ‌కుడు కూచిబొట్ల శ్రీనివాస్ హ‌త్య‌పై వైట్‌హౌజ్ స్పందించింది. ఈ మేర‌కు ట్రంప్‌ ప్రెస్ సెక్ర‌టరీ సీన్ స్పైసర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాన్సాస్‌లో జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌చివేసింద‌ని అన్నారు. హెచ్‌-1బీ వీసాలు, భారతీయుల‌పై హింస గురించి చ‌ర్చించ‌డానికి భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి జైశంక‌ర్ నాలుగు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన రోజే వైట్‌హౌజ్ నుంచి ఈ ప్ర‌క‌ట‌న జారీ కావ‌డం గ‌మ‌నార్హం. అమెరికాలో యూదుల‌పై జ‌రుగుతున్న హింస‌ను ఖండిస్తూ జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌లో కాన్సాస్ ఘ‌ట‌న గురించి కూడా స్పైస‌ర్ ప్ర‌స్తావించారు. జాతి, మ‌తం ఆధారంగా హింస‌కు అమెరికాలో తావులేద‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో స్పైస‌ర్ స్ప‌ష్టంచేశారు. 


పౌరుల హ‌క్కుల‌ను కాపాడాల‌న్న ప్రాథ‌మిక విధికి మేము క‌ట్టుబడి ఉన్నాం. ఏ పౌరుడైనా ఏ మ‌త ధ‌ర్మాన్నైనా స్వేచ్ఛ‌గా పాటించ‌వ‌చ్చు. ఈ ప్రాథ‌మిక సూత్ర సంర‌క్ష‌ణ‌కు అధ్య‌క్షుడు క‌ట్టుబ‌డి ఉన్నారు. ఓవైపు ఈ వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా తాము సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలోనే కాన్సాస్ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌చివేసింది అని స్పైస‌ర్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక ఏజెన్సీలతో క‌లిసి ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (ఎఫ్‌బీఐ) విచార‌ణ జ‌రుపుతున్నది. అయితే ట్రంప్ ఈ కాన్స‌స్ ఘ‌ట‌న‌ను నేరుగా ఖండించ‌కపోవ‌డంపై డెమొక్రాట్లు తీవ్రంగా మండిప‌డ్డారు. అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల కోసం పోటీ ప‌డిన హిల్ల‌రీ, బెర్నీ శాండ‌ర్స్‌.. ఈ మేర‌కు ట్రంప్ తీరును త‌ప్పుబ‌డుతూ ట్వీట్స్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com