ఇటీవల విడుదలైన ఓ క్లిప్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రక్కన ఉన్న ఫ్రెండ్ జిప్సా బేగం ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కొందరు తన ఫోటోలని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ ఫైర్ అవుతుంది జిప్సా. మార్ఫింగ్ బాధితురాలలో తాను మొదటి దానిని కాదని చెబుతున్న ప్రియా ఫ్రెండ్, ఇతరుల మనోభావాలతో ఆడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు తన వ్యక్తిత్వాన్ని అస్సలు దిగజార్చవని అంటుంది. మార్ఫ్ చేసిన ఫొటోలు తనవిగా భావించే వాళ్లంతా ఓ విషయాన్ని గమనించాలని.. చైనా పీస్‌లకు, ఒరిజినల్ ఐఫోన్లకు ఎంత తేడా ఉంటుందో.. ఈ ఫొటోలకు కూడా అంతే తేడా ఉంటుందంటూ ఘాటుగా స్పందించింది జిప్సా బేగం. ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఒరు ఆదార్ లవ్ అనే మళయాళ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాటలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువత గుండెల్లో బాణాలు దించింది ప్రియా. 18 ఏళ్ళ ఈ భామకి ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 4.5 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.