పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను పెళ్లి చేసుకున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. అటు ఆయన పార్టీ పీటీఐ నిఖాకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. రెండేళ్ల కిందట బుష్రా అలియాస్ పింకీ పీర్‌తో ఇమ్రాన్‌కు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె దగ్గరికి ఆధ్యాత్మిక సలహాల కోసం ఇమ్రాన్ వెళ్తుండేవారు. ఈ పెళ్లికి ఇమ్రాన్ సమీప బంధువులు, పీటీఐ నేతలు హాజరయ్యారు.