అతి తక్కువ ధరకే లభించే బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆహార నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మలబద్ధకం తొలగిపోతాయి. బొప్పాయిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు రావు. దృష్టిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.