ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగం టిడిపి వాళ్లకు వర్తించదా--మంత్రి జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 06:45 PM

రాజ్యాంగం టిడిపి వాళ్లకు వర్తించదా అని చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసుల అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో వెబ్ సైట్లో పోస్టులు పెట్టాడని ఆరోపించారు. విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలి అని అన్నారు. 


నాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న తండ్రి (అయ్యన్నపాత్రుడు) పొక్లెయిన్ తీసుకెళితే పారిపోయాడని, నేడు తప్పుడు పని చేసి కొడుకు (విజయ్) పారిపోయాడని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఐటీడీపీని పర్యవేక్షిస్తోంది చింతకాయల విజయ్ అని వెల్లడించారు. రాజ్యాంగం టీడీపీ వాళ్లకు వర్తించదనుకుంటున్నారా? అందుకే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.


చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు వెళితే దాడి చేసినట్టు అసత్య కథనాలు రాశారని మండిపడ్డారు. ఒక దొంగకు ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తోందని విమర్శించారు. అలాంటి వాళ్లను సమర్థిస్తే రేపు మీ కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడతారు... రామోజీరావు, రాధాకృష్ణలకు కూడా కుటుంబాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com