తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేలు 21 మంది తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలను టీఎంసీ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లోనూ 'ఆపరేషన్ కమలం' కుట్ర సాగుతుందని విపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి
![]() |
![]() |